
నాగర్ కర్నూల్, 25 జూలై (హి.స.) నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమనగల్లు పోలీస్ స్టేషన్ ను శనివారం ఏసీపీ జానకీ రెడ్డి సందర్శించారు. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పలు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. కేసుల చేతనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, సైబర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేసి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్ లో విస్తృతంగా ఉపయోగించి, సైబర్ భద్రత, రోడ్డు భద్రత నివారణ వంటి అంశాల పై నిరంతరం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏసీపీ జానకీ రెడ్డి అందించిన సూచనలను ఆమనగల్లు పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు పనిచేయాలని సీఐ వెంకటేశ్వర్లు కు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు