ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజన్ గా.భోగాపురం ఎయిర్పోర్ట్ మారనుంది / మంత్రి మందపల్లి.రాంప్రసాద్
ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజన్ గా.భోగాపురం ఎయిర్పోర్ట్ మారనుంది / మంత్రి మందపల్లి.రాంప్రసాద్
ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజన్ గా.భోగాపురం ఎయిర్పోర్ట్ మారనుంది / మంత్రి మందపల్లి.రాంప్రసాద్


విజయనగరం, 25 జూలై (హి.స.)

‘భూమి నుంచి భవిష్యత్తు వరకు’ పేరుతో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రచార కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. విమానాశ్రయం వరకు భారీ వాహన ర్యాలీని.. విజయనగరం కోట వద్ద మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్గా మారనుందన్నారు. విమానాశ్రయంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లెడ్జ్వాల్పై సంతకాలు చేశారు. ఎయిర్పోర్ట్ ప్రారంభానికి కౌంట్ డౌన్ చూపిస్తూ డిజిటల్ టైమర్ వాల్ ఆవిష్కరించారు. సెల్ఫీ పాయింట్లో ఉత్సాహంగా ఫొటోలు తీసుకున్నారు.

జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, జేసి సేధు మాధవన్, ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవి, కిమిడి కళా వెంకట్రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande