మాకు దేశమే ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
మాకు దేశమే ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Union Minister


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర

ప్రధాన్ రాజీనామాపై బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించారు. దేశం ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్ అదే తమ పార్టీ సిద్ధాంతం అని తెలిపారు. పదవులు తాత్కాలికం అని కానీ ప్రజల విశ్వాసమే ప్రధానం అని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి ఉద్యమం నుండి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించడం వరకు దశాబ్దాల పాటు సేవలు అందించాడని పేర్కొన్నారు.

ఆయన అందించిన సేవలకు, చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల మాట వినడం, వారి గొంతును గౌరవించడం అని అవసరమైనప్పుడు బాధ్యత తీసుకునే ధైర్యం కలిగి ఉండాలన్నారు. ఇదిలా ఉంటే నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ విద్యార్థులు చేసిన డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande