ఆలూరు నియోజకవర్గంలో విస్తృతంగా చంద్రబాబు పర్యటన
ఆలూరు నియోజకవర్గంలో విస్తృతంగా చంద్రబాబు పర్యటన
Chandrababu Naidu(file)


కర్నూలు , 25 జూలై (హి.స.)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శనివారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా కర్నూలు జిల్లా ఆస్పరి చేరుకున్న ముఖ్యమంత్రి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య కార్యక్రమం ‘సంజీవని’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్వయంగా సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవల నాణ్యతను పరిశీలించారు. ఆసుపత్రిలోని రోగులు, వైద్య సిబ్బందితో నేరుగా మాట్లాడి సంజీవని పథకం ద్వారా అందే ఉచిత వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.ఆ తర్వాత ఆస్పరిలో ఏర్పాటు చేసిన 'ప్రజా వేదిక' భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం దిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై, రాబోయే ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానిని స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో దాదాపు 2,000 మంది పోలీసు బలగాలతో కర్నూలు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande