కోడలి ఫిర్యాదుతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా 11 మందిపై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదు!
కోడలి ఫిర్యాదుతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా 11 మందిపై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదు!
కోడలి ఫిర్యాదుతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా 11 మందిపై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదు!


విజయవాడ, 25 జూలై (హి.స.)

:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. ఆయన పెద్ద కుమారుడు జోగి రాజీవ్ భార్య జోగి మేఘన ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పలు తీవ్రమైన నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.తెలంగాణలోని సూర్యాపేట/కోదాడ ప్రాంతానికి చెందిన మేఘనకు, జోగి రాజీవ్‌తో గతేడాది వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నెల రోజుల నుంచే అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులు ఆపాలంటే అదనంగా మరో రూ.5 కోట్ల కట్నం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ, ఇంట్లోని పైఅంతస్తు గదిలో తనను ఒంటరిగా బంధించి చిత్రహింసలు పెట్టారని ఆరోపించింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా తనపై దాడి చేసి, చంపేందుకు (హత్యాయత్నం) ప్రయత్నించారని మేఘన పోలీసులకు వివరించింది.బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన ఇబ్రహీంపట్నం పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 85 (భర్త లేదా అతడి బంధువులు మహిళను క్రూరత్వానికి గురిచేయడం), 318 (చీటింగ్), 109 (హత్యాయత్నం) మరియు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైన వారిలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, కుమారుడు రాజీవ్, కుమార్తె ప్రియాంక, జోగి రమేష్ సోదరుడు జోగి రాము మరియు ఆయన కుమారులతో కలిపి మొత్తం 11 మంది ఉన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande