నీట్ లీకేజీ వివాదం: విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీలో విద్యార్థి సంఘాల ఉధృత ఆందోళనలు.. రూ.కోటి పరిహారం డిమాండ్!
నీట్ లీకేజీ వివాదం: విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీలో విద్యార్థి సంఘాల ఉధృత ఆందోళనలు.. రూ.కోటి పరిహారం డిమాండ్!
neet


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

అమరావతి:నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని పలు విద్యార్థి సంఘాలు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు స్వాగతించారు. అయితే కేవలం మంత్రి రాజీనామాతోనే తమ పోరాటం ముగిసిపోలేదని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఇవాళ శనివారం విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు .

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇవాళ విద్యార్థి సంఘాలు అత్యవసర సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను ఉంచాయి.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజులుగా శాంతియుత మార్గంలో నిరసనలు తెలిపిన విద్యార్థులు, యువతపై పోలీసులు నమోదు చేసిన చట్టపరమైన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో ఉన్న లోపాలను పూర్తిగా సరిదిద్ది, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా విద్యార్థులకు నమ్మకం కలిగించేలా పారదర్శకమైన విచారణ జరపాలని స్పష్టం చేశారు.మరోవైపు నిరసనకారులపై పెల్లెట్ గన్స్, ఎలక్ట్రిక్ షాక్ ఆయుధాలు వంటివి వాడకూడదని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)కు కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేసింది . ప్రజాస్వామ్యబద్ధంగా తాము చేసే పోరాటాన్ని అణచివేయలేరని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకుంటే వచ్చే వారం నుండి ఏపీవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande