ఆగి ఉన్న వ్యాను ను ఢీ కొనడంతో ముగ్గురు దుర్మరణం
ఆగి ఉన్న వ్యాను ను ఢీ కొనడంతో ముగ్గురు దుర్మరణం
Road accident


అమరావతి, 28 జూలై (హి.స.)

విజయనగరం అయ్యన్నపేట, గ్రామీణం, రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. దైవ దర్శనానికి వెళ్తున్న యాత్రికులను మృత్యువు వెంటాడింది. ఆగిఉన్న వ్యాన్ను ఢీకొనడంతో బాలుడితో పాటు మరో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన విజయనగరం మండలం చెల్లూరులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పలువురు క్షతగాత్రులుగా మారారు. బాధితుల వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట, డెంకాడ మండలం బొడ్డవలస, విజయనగరం మండలం చెల్లూరుకు చెందిన మూడు కుటుంబాల్లో 16 మంది రాయగడ వెళ్లేందుకు వ్యాన్ను బుక్ చేసుకున్నారు. బొచ్చపేట నుంచి బయలుదేరిన వాహనంలో అయినాడ కూడలి వద్ద బొడ్డవలసకు చెందిన కొంతమంది ఎక్కారు. అనంతరం చెల్లూరు దగ్గర ఆపారు. ఈ క్రమంలో అతివేగంతో విశాఖ నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టి.. సుమారు 500 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ధాటికి బొచ్చపేటకు చెందిన చింతపల్లి రాంబాబు అలియాస్ రామునాయుడు(50), మజ్జి నారాయణరావు(50), బి.మోహననాయుడు(8) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికి కాళ్లు విరిగిపోయాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande