
హనుమాన్జంక్షన్:, 28 జూలై (హి.స.)
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, పక్కసీటులో ఉన్న అతని భార్యకు గాయాలయ్యాయి. మృతుడు రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు నున్నా సరేశ్గా గుర్తించారు. హనుమాన్ జంక్షన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులు ఇవాళ తెల్లవారుజామున విజయవాడ వైపు నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఘటన జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ