సీ పీ ఆర్ చేసి ఓ భక్తుడిని కాపాడిన ఎస్సీ టీ రామకృష్ణ
సీ పీ ఆర్ చేసి ఓ భక్తుడిని కాపాడిన ఎస్సీ టీ రామకృష్ణ
cpr


కోటనందూరు, 28 జూలై (హి.స.)

, సమయానికి స్పందించి సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేయడం ద్వారా ఓ భక్తుడి ప్రాణాలను కాకినాడ జిల్లా కోటనందూరు ఎస్సై టి.రామకృష్ణ కాపాడారు. తుని మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ తల్లి లోవ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆషాఢమాసం లోవ క్షేత్రాన్ని 50 వేల మందికి పైగా భక్తులు దర్శించారు. ట్రాఫిక్ 5 కి.మీ. మేర నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుంచి భార్యతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో రహదారిపై కుప్పకూలారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై రామకృష్ణ వెంటనే పరిస్థితిని గుర్తించి బాధితుడికి సపర్యలు చేసి సీపీఆర్ నిర్వహించడంతో స్పృహలోకి వచ్చారు. వెంటనే తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో భక్తుడు కోలుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande