
విశాఖపట్నం, 28 జూలై (హి.స.)
ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక భూ కేటాయింపులు చేసింది. విశాఖపట్నంలో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ఏఐజీ (AIG Hospitals) మెడికల్ క్యాంపస్ విస్తరణ కొరకు అదనంగా 2.16 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మెడికల్ క్యాంపస్ ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సదుపాయాలు విశాఖలోనే లభించనున్నాయి. పరిశోధనలు, వైద్య విద్యతో పాటు గుండె, కాలేయ మార్పిడి వంటి సంక్లిష్టమైన చికిత్సలు కూడా ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. ఈ ల్యాండ్ అలోట్‌మెంట్ ద్వారా నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయని, విశాఖ హెల్త్ హబ్‌గా మారడానికి ఇది దోహదపడుతుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi