వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు: పీహెచ్సీల (PHC) ర్యాంకింగ్ స్థానంలో అవుట్కమ్ బేస్డ్ గ్రేడింగ్ సిస్టమ్
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు: పీహెచ్సీల (PHC) ర్యాంకింగ్ స్థానంలో అవుట్కమ్ బేస్డ్ గ్రేడింగ్ సిస్టమ్
ap


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

రాష్ట్రంలోని వైద్యారోగ్య రంగంలో మరింత పారదర్శకత, నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (PHCs) ఇస్తున్న సాధారణ ర్యాంకింగ్ విధానాన్ని రద్దు చేస్తూ, దాని స్థానంలో అవుట్‌కమ్ బేస్డ్ హెల్త్‌కేర్ గ్రేడింగ్ (Outcome-based healthcare grading) విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. కేవలం రోగుల సంఖ్యను మాత్రమే కాకుండా, పీహెచ్‌సీలలో రోగులకు అందించిన చికిత్సల నాణ్యత, గుణాత్మక మార్పులు, మందుల పంపిణీ మరియు రోగుల సంతృప్తి ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. ఈ కొత్త విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని, సిబ్బంది జవాబుదారీతనం పెరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande