హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం: లోయలో కారు పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం: లోయలో కారు పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
accident


చంబా, 28 జూలై (హి.స.)

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా పఠాన్‌కోట్-చంబా జాతీయ రహదారిపై బనిఖేత్ పట్టణ సమీపంలోని లహడ్ వద్ద సోమవారం రాత్రి ఘోర రహదారి ప్రమాదం జరిగింది. చండీగఢ్‌లోని పిజిఐ ఆసుపత్రిలో తమ చిన్నారికి వైద్య పరీక్షలు ముగించుకుని స్వగ్రామమైన గేహ్రాకు తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రయాణిస్తున్న కారు అనివార్య కారణాల వల్ల అనియంత్రితమై దాదాపు 400 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అనారోగ్యంతో ఉన్న చిన్నారితో పాటు వచన్ సింగ్ (60), రిపున్ సింగ్ (30), రింపీ దేవి, కీర్తి (23) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు స్థానికుల సాయంతో రాత్రి సమయంలో తీవ్ర శ్రమకోర్చి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం డల్హౌసీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని చంబా ఎస్పీ విజయ్ కుమార్ సక్లానీ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande