పార్లమెంట్లో ముగిసిన గందరగోళం: నేడు లోక్సభలో 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'పై చర్చ
పార్లమెంట్లో ముగిసిన గందరగోళం: నేడు లోక్సభలో 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'పై చర్చ
anti


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం మరియు ఆందోళనకారులపై పోలీసుల చర్యలకు సంబంధించి గత ఆరు రోజులుగా పార్లమెంట్‌లో ఏర్పడిన స్థంబన వీడింది. మంగళవారం లోక్‌సభలో ‘యాంటీ పేపర్ లీక్ బిల్లు’ (పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, 2026) పై చర్చించేందుకు ప్రతిపక్షాలు అంగీకరించాయి. స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన ఫ్లోర్ లీడర్ల సమావేశం అనంతరం ఈ ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ బిల్లుపై చర్చించేందుకు లోక్‌సభలో కనీసం 6 గంటల సమయం కేటాయించారు.

ఇదే క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నూతనంగా ఏర్పడిన ఎన్‌సిపిఐ (NCPI) పార్టీ ప్రతినిధులు కూడా తొలిసారిగా హాజరయ్యారు.

రాజ్యసభలో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ 'MSME అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026'ను ప్రవేశపెట్టగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా 'జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు, 2026'ను పరిశీలన కోసం సభ ముందుకు తెచ్చారు.

అలాగే, జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి ఆందోళనకారులపై పెల్లెట్ గన్ల వినియోగం, పోలీసుల చర్యలపై స్వతంత్ర జుడీషియల్ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్, సిపిఐ ఎంపీలు మనీష్ తివారీ, పి. సంతోష్ కుమార్ ఉభయ సభల్లో వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande