
అమరావతి, 28 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పొగాకు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో ఉన్నతాధికారులతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ చర్చలలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రూ.188 కోట్ల నిధుల భారాన్ని భరించేందుకు అంగీకరించాయి. రాష్ట్రంలోని 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లకు గాను ధరల లోటు భర్తీ కింద రైతులకు కిలోకు రూ.20 అదనంగా అందించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల ప్రకారం.. బ్రైట్ రకం పొగాకు కిలోకు రూ.240, మీడియం రకం రూ.190, లో గ్రేడ్ రకం రూ.110 కంటే తగ్గకుండా మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది పొగాకు రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు రాకుండా శాశ్వత మార్కెటింగ్ వ్యూహాలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi