ప్రొద్దుటూరును కార్పొరేషన్గా ప్రకటించాలి: టీడీపీ నేత రాజేశ్వర రెడ్డి డిమాండ్!
ప్రొద్దుటూరును మున్సిపల్ కార్పొరేషన్గా మార్చి, చుట్టుపక్కల కొత్తపల్లెతో సహా ఇతర పంచాయతీలను విలీనం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ప్రొద్దుటూరును కార్పొరేషన్గా ప్రకటించాలి: టీడీపీ నేత రాజేశ్వర రెడ్డి డిమాండ్!


ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా), 28 జూలై (హి.స.) ప్రొద్దుటూరును మున్సిపల్ కార్పొరేషన్గా మార్చి, చుట్టుపక్కల కొత్తపల్లెతో సహా ఇతర పంచాయతీలను విలీనం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చుట్టూ ఉన్న పంచాయతీలను విలీనం చేసి ప్రొద్దుటూరును కార్పొరేషన్ గా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక నెహ్రూ రోడ్డు లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాసంస్థల సినీ హబ్ రాజేశ్వర రెడ్డి మాట్లాడారు. వారి డిమాండ్ లోని ప్రధాన అంశాలు కొత్తపల్లె తో పాటు ఇతర పంచాయతీలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న కొత్తపల్లె, ఇతర గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలపాలని కోరారు. కార్పొరేషన్ హోదా పంచాయతీల విలీనం తర్వాత జనాభా ప్రాతిపదికన ప్రొద్దుటూరుకు కార్పొరేషన్ హోదా ఇవ్వాలని అన్నారు. అభివృద్ధే లక్ష్యం పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేస్తే అన్ని రకాల మౌలిక సదుపాయాలు వస్తాయని, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

ప్రజల మద్దతు విలీనానికి ప్రజలు కూడా అనుకూలంగా ఉన్నారని రాజేశ్వర రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీ. చుట్టుపక్కల పంచాయతీల్లో నగరానికి దీటుగా జనాభా పెరిగినా, ఇంకా పంచాయతీ పాలనలోనే ఉండటంతో డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, స్ట్రీట్ లైట్లు లాంటి సౌకర్యాలు సరిగా లేవని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే విలీన ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు. అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీ ప్రాంగణంలో అధికారులు ప్రజల వద్ద నుంచి సర్వే ఏర్పాటు చేయనున్న సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కి కొత్తపల్లె పంచాయతీ విలీన ఏర్పాటుకు ప్రజలందరూ మద్దతు తెలపాలని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande