
విజయనగరం, 28 జూలై (హి.స.)
విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు అక్కడి క్షేత్రస్థాయి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్టును ప్రారంభించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకను అత్యంత వైభవంగా మరియు రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఇదివరకే ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి లోకేశ్ రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగానికి ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒక మైలురాయిగా నిలవనుందని, నిర్ణీత గడువులోగా మిగిలిన అన్ని అనుసంధాన పనులను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi