అంగన్వాడీల పేరుతో విషప్రచారం.. వైసీపీపై మంత్రి లోకేశ్ ఫైర్
అంగన్వాడీల పేరుతో విషప్రచారం.. వైసీపీపై మంత్రి లోకేశ్ ఫైర్
Lokesh


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

అంగన్వాడీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీలకు అమ్మఒడి పథకం అందలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అమలు చేసిందని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో తనకు మద్దతుగా అంగన్వాడీలు నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీని వైసీపీ నేతలు కావాలనే నిరసన కార్యక్రమంగా చూపుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై మంత్రి లోకేశ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘ఫేక్ వర్సెస్ రియల్’ పేరుతో వీడియోను విడుదల చేశారు. అంగన్వాడీల పేరుతో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి తెలిపారు.వైసీపీ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు అమ్మఒడి ఇవ్వకుండా గొడ్డలి పార్టీ అన్యాయం చేసిందని మంత్రి మండిపడ్డారు. ‘కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు తల్లికి వందనం పథకం వర్తింపజేయడంతో సంతోషంతో వారు నా పెనమలూరు నియోజకవర్గ పర్యటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రచారం చేసిన గొడ్డలి పార్టీ.. అంగన్వాడీల ఈ కృతజ్ఞత ర్యాలీని, నిరసన ర్యాలీ అంటూ విష ప్రచారం చేస్తోంది’ అని ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande