మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఔషధాల పంపిణీకి డ్రోన్ సేవల కేంద్రాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఔషధాల పంపిణీకి డ్రోన్ సేవల కేంద్రాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
medicine


అమరావతి, 28 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన ప్రాంతాలలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒక వినూత్నమైన ఐడియాకు శ్రీకారం చుట్టింది. మారుమూల ఏజెన్సీ గ్రామాలు, కొండ ప్రాంతాలలో అత్యవసర సమయాల్లో ప్రాణరక్షక ఔషధాలను (Medicines) వేగంగా అందించడానికి ప్రత్యేకంగా డ్రోన్ సేవల కేంద్రాలను (Drone Centres) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు రవాణా సౌకర్యం సరిగ్గా లేని గిరిజన తండాలకు ఈ డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో మందులు చేరవేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గిరిజన సంక్షేమ మరియు ఆరోగ్య శాఖల సమన్వయంతో ఈ ప్రాజెక్టును త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించనున్నారు. ఈ వినూత్న సాంకేతికత ద్వారా గిరిజన ప్రాంతాలలో ప్రసవ సమయాల్లో మరియు అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande