
అల్లూరి సీతారామరాజు, 28 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శత్రుచర్ల సంధ్యారాణి ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉమ్మడిగా పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి, ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్థానిక అధికారులతో కలిసి వారు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గిరిజన మహిళలు, పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని హోంమంత్రి అనిత పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే, మారుమూల గిరిజన గ్రామాలకు వైద్య సేవలను వేగంగా అందించడానికి ప్రభుత్వం డ్రోన్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని మంత్రి సంధ్యారాణి ఈ సందర్భంగా వెల్లడించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, మారుమూల గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలను మెరుగుపరచాలని మంత్రులు అధికారులను ఆదేశించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi