డీఎస్సీపై బహిరంగ చర్చకు రండి.. వైసీపీ నేతలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్
డీఎస్సీపై బహిరంగ చర్చకు రండి.. వైసీపీ నేతలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్
డీఎస్సీపై బహిరంగ చర్చకు రండి.. వైసీపీ నేతలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

వైసీపీ నేతలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. డీఎస్పీపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాల్‌ను వైసీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే స్వీకరించాలన్నారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని జగన్, వైసీపీకి ఛాలెంజ్ చేశారు. జగన్, ఆయన టీంకు బుద్ధి లేదని.. ప్రజలకు మంచి చేస్తున్నా కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ విద్యాశాఖ మంత్రి అయ్యాకే.. విద్యారంగంలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని.. పెనుమార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు.లోకేశ్‌ను వైసీపీ నేతలు రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన కుటుంబాలను వైసీపీ నేతలు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు మెండుగా వస్తున్నాయన్నారు. ఏపీ బ్రాండ్‌ను చెడగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదే పద్ధతిలో వైసీపీ వెళ్తే.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 11 సీట్లు కూడా రావని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande