
రాయచోటి, 28 జూలై (హి.స.) :అన్నమయ్య జిల్లా రాయచోటి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని శ్రీ శక్తి ఉపాధి హామీ భవనంలో నిర్వహించిన శక్తి టీం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మహిళలు, బాలికలు, యువతకు సంబంధించిన భద్రత, చట్టాలు, సామాజిక బాధ్యతలు, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించారు.
సమావేశంలో అర్బన్ సీఐ వెంకటచలపతి మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించే వివిధ చట్టాలు, మహిళలపై జరిగే వేధింపులు, గృహ హింస, లైంగిక వేధింపులు, బాలికలపై జరిగే నేరాలు, అత్యాచారాలకు సంబంధించిన చట్టాలు, పోక్సో (POCSO) చట్టం వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు.
ఎలాంటి నేరం జరిగినా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, బాధితులకు ప్రభుత్వం మరియు పోలీసు శాఖ అందించే సహాయంపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లల స్నేహితుల వర్గం, వారి రోజువారీ కార్యకలాపాలు, పాఠశాల హాజరు, సెల్ఫోన్ వినియోగం, సోషల్ మీడియా అలవాట్లను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. పిల్లలకు మంచి నైతిక విలువలు, క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవాటు చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని వివరించారు.ప్రస్తుతం యువత మరియు చిన్నారులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, గంజాయి, మాదకద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలను వివరించారు.
ఇటువంటి అలవాట్లు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు , అప్రమత్తంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.సెల్ఫోన్, సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల పిల్లల చదువు, ఆరోగ్యం, మానసిక వికాసం మరియు భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాల గురించి వివరించి, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం, పిల్లలను క్రీడలు, పుస్తక పఠనం మరియు సృజనాత్మక కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు మరియు బాలికలు వినియోగించగల SOS (Emergency SOS) సదుపాయం గురించి అవగాహన కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV