తిరుచానూరులో శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ: పద్మావతి అమ్మవారి దర్శనం!
తిరుచానూరులో శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ: పద్మావతి అమ్మవారి దర్శనం!
తిరుచానూరులో శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ: పద్మావతి అమ్మవారి దర్శనం!

Andhra Pradesh, 28 జూలై (హి.స.) తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉడిపి శ్రీ ఆదమరు మఠం పిఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు.

అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శ్రీ ఆదమరు మఠం పిఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ కి చిన్న మర్యాదతో ఆలయం వద్ద ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ సురేష్, ఆలయ అర్చకులు బాబు స్వామి ఆలయ మర్యాదలతో సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి మూలమూర్తిని దర్శనం చేసుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆశీర్వాదం మండపంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

 rajesh pande