కశ్మీర్లో లోయలో పడిన అమర్నాథ్ యాత్రికుల బస్సు: 30 మందికి పైగా గాయాలు
కశ్మీర్లో లోయలో పడిన అమర్నాథ్ యాత్రికుల బస్సు: 30 మందికి పైగా గాయాలు
amarnath


అమర్‌నాథ్, 28 జూలై (హి.స.)

జమ్మూ కశ్మీర్‌లోని గాంధర్‌బల్ జిల్లా కంగన్ ప్రాంతంలో అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు మంగళవారం ప్రమాదానికి గురైంది. గుంద్ సమీపంలోని హరిగాన్వాన్ వద్ద ఉన్న 'ఎస్-మోడ్' మలుపు వద్ద డ్రైవర్ వేగ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రహదారి నుంచి జారి లోయలోకి దూసుకెళ్లింది. కింద ఉన్న ఒక ఇంటిపై బస్సు పడటంతో అక్కడ ఆగిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే, బస్సు ఇంటిపై పడటం వల్ల పక్కనే ఉన్న సింధ్ నదిలో పడిపోకుండా ఆగింది.

ఈ ప్రమాదంలో కనీసం 30 మంది అమర్‌నాథ్ యాత్రికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే గుంద్ పోలీసులు, ఐటీబీపీ, సిఆర్‌పిఎఫ్ 118 బెటాలియన్, 2 అస్సాం రైఫిల్స్, 21 రాష్ట్రీయ రైఫిల్స్ బృందాలు, యాత్రా పోలీసులు మరియు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్‌హెచ్‌ఓ రయీస్ అహ్మద్ నాయకత్వంలో ప్రమాదానికి గురైన బస్సు నుంచి యాత్రికులను సురక్షితంగా బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన యాత్రికులలో ఎక్కువమందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande