అంతర్జాతీయ వేదికపై ఏపీ క్రీడాకారుడి ఘనత: కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్లో వల్లూరి అజయ్బాబుకు రజతం
అంతర్జాతీయ వేదికపై ఏపీ క్రీడాకారుడి ఘనత: కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్లో వల్లూరి అజయ్బాబుకు రజతం
ajay


విజయనగరం, 28 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్‌బాబు అంతర్జాతీయ కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకం కైవసం చేసుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన అజయ్‌బాబు వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అజయ్‌బాబుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అజయ్ సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశ మొత్తానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఇలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అజయ్‌బాబు భవిష్యత్తులో మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande