
హైదరాబాద్, 30 జూలై (హి.స.)
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను ఉద్దేశించి 'పాకిస్థానీ కశ్మీర్' అని సంబోధిస్తూ కథనం ప్రచురించిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ది న్యూయార్క్ టైమ్స్' (NYT) వైఖరిపై భారతదేశం తీవ్ర స్థాయిలో మండిపడింది. న్యూయార్క్ టైమ్స్ వాడిన ఈ పదం అత్యంత 'తప్పుదారి పట్టించేదిగా, అవాస్తవంగా మరియు పక్షపాతపూరితంగా' ఉందని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం దౌత్యపరంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించిన వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం... పాకిస్థానీ కశ్మీర్ అనేదేదీ లేదు, అక్కడ ఉన్నది కేవలం పాకిస్థాన్ బలవంతంగా, అక్రమంగా ఆక్రమించిన 'పాక్ ఆక్రమిత కశ్మీర్' (PoK) మాత్రమే అని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, అవి దేశం నుండి విడదీయరాని భూభాగాలని పునరుద్ఘాటించింది. 1947 నుండి పాకిస్థాన్ ఆయా ప్రాంతాలను అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకోవడమే కాకుండా, అక్కడ నివసిస్తున్న స్థానిక ప్రజల మానవ హక్కులను కాలరాస్తూ, వారిపై తీవ్ర హింసకు పాల్పడుతోందని దౌత్యకార్యాలయం ధ్వజమెత్తింది.
అసలేమైందంటే..
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పరిధిలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు, అక్కడ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పిండి మరియు విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పౌర హక్కుల సమూహాలు జరిపిన భారీ నిరసనలపై న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికను రూపొందించింది. ఈ నిరసనల్లో పాక్ రేంజర్ల కాల్పుల వల్ల పలువురు స్థానికులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ అంతర్గత ఘర్షణలు , అణచివేతను కవర్ చేసే క్రమంలో, ఆ ప్రాంతాన్ని స్వతంత్రంగా లేదా పాకిస్థాన్‌కు చెందిన ప్రాంతంగా చిత్రీకరించేలా 'పాకిస్థానీ కశ్మీర్' అని హెడ్‌లైన్ పెట్టడంపై భారత్ మండిపడింది. అంతర్జాతీయ మీడియా సంస్థలు భౌగోళిక సరిహద్దులు సార్వభౌమాధికార విషయాల్లో కనీస బాధ్యతతో వ్యవహరించాలని, వాస్తవాలను వక్రీకరించకూడదని హితవు పలికింది.
ఐక్యరాజ్యసమితి (UN) తీర్మానాల ప్రకారం కూడా ఆ ప్రాంతం వివాదాస్పద ఆక్రమిత ప్రాంతమేనని, దానికి 'పాకిస్థానీ కశ్మీర్' అని పేరు పెట్టడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని భారత విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వంటి ప్రాజెక్టులు కూడా ఈ PoK గుండానే సాగుతుండటంతో, భారత్ ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై తన సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా చాటి చెప్పిం
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi