
హైదరాబాద్, 30 జూలై (హి.స.)
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో నిరసన చేపట్టిన విద్యార్థులపైకి భద్రతా బలగాలు పెల్లెట్ గన్స్ (Pellet Guns) వినియోగించాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతాబలగాల చర్యను నిరసిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం సుముఖత వ్యక్తంచేసింది.ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం.. అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడటాన్ని పోలీసు నిబంధనలు అనుమతిస్తున్నాయని పేర్కొన్నది. అదే సమయంలో ఇటీవల ఆందోళనలో భద్రతాబలగాలు వాడిన మందుగుండు సామగ్రి లాగ్ రికార్డులను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi