
న్యూఢిల్లీ, 30 జూలై (హి.స.)
విపక్షాల ఆందోళనలు, గందరగోళం
నడుమ ఆయా పార్టీల నేతల సుధీర్ఘ ప్రసంగాల అనంతరం జాతీయ గేయం వందేమాతరంపై బిల్లు లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971'లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఈ వందేమాతరం బిల్లును ఇప్పటికే రాజ్యసభ కూడా ఆమోదించిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు