రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ
Kiran Bedi


హైదరాబాద్, 30 జూలై (హి.స.)

లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ (Kiran Bedi) స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణ, చట్టవ్యతిరేక జనసమూహాలను నియంత్రించడం, చెదరగొట్టడం అనే బాధ్యత పూర్తిగా సంఘటనా స్థలంలో ఉన్న అత్యున్నత పోలీస్ అధికారి పైనే ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ అక్కడ సీనియర్ అధికారి అందుబాటులో లేకపోయినా, మైదానంలో ఉన్న పోలీస్ సిబ్బంది అక్కడి పరిస్థితికి అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి చిన్న నిర్ణయానికి కేంద్ర హోం మంత్రి నుంచి ఆదేశాలు వస్తాయని భావించడం, వారి ఉత్తర్వుల కోసం వేచి చూడటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కిరణ్ బేడీ పేర్కొన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి చట్ట పరిధిలో తమ విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటారని, దీనిని రాజకీయ కోణంలోకి లాగడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ బుధవారం లోక్ సభ ముందు మీడియాతో మాట్లాడుతూ.. హోంమంత్రి అమిత్ షా స్వయంగా పోలీసులు ఆదేశాలు ఇచ్చారని, ఆయన ఆదేశాలతోనే పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్, పెల్లెట్ గన్ ఉపయోగించాలని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande