నాటిన ప్రతి మొక్కను రక్షించాలి : ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత
నాటిన ప్రతి మొక్కను రక్షించాలి : ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత
Collector


ఆసిఫాబాద్, 25 ఆగస్టు (హి.స.)

వాతావరణంలో సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటిన వాటిని రక్షించాలని ఆసిఫా జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నితిక పంత్, జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఎస్ వో బాలమణిలతో పాటు ఇతర జిల్లా అధికారులతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యాలు కావాలని కోరారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించవచ్చని చెప్పారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కేటాయించిన లక్ష్యాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తి చేయాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande