కడప జిల్లా లోని పులివెందుల అర్బన్ సీ ఐ శ్రీరామ్ పై బదిలీ వేటు
కడప జిల్లా లోని పులివెందుల అర్బన్ సీ ఐ శ్రీరామ్ పై బదిలీ వేటు
కడప జిల్లా లోని పులివెందుల అర్బన్ సీ ఐ శ్రీరామ్ పై బదిలీ వేటు


కడప, , 26, ఆగస్టు (హిం.స)

:కడప జిల్లాలోని పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కడప వీఆర్కు ఆయనను బదిలీ చేసింది. పులివెందులలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్లు కలెక్టర్, ఆర్డీఓలకు వైఎస్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఈ కబ్జాపై పులివెందుల ఆర్డీవో చిన్నయ్య విచారించారు.

ఓ కబ్జా బ్యాచ్ కబ్జా చేసి నకిలీ పాసుపుస్తకాలు సృష్టించినట్లు విచారణలో నిర్ధారించారు. కబ్జా చేసిన అక్రమార్కులపై పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆర్డీఓ చిన్నయ్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినా నిందితులను సీఐ శ్రీరామ్ అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే డీఐజీ కోయ ప్రవీణ్ సీఐ శ్రీరామ్ను వీఆర్కు బదిలీ చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande