
సూర్యాపేట , 26 ఆగస్టు (హి.స.)
సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను అధికారుల ద్వారా పవన్ తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర అధికారులతో ఏపీ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ