నాంపల్లిలో టెన్షన్ టెన్షన్: బీజేపీ చీఫ్ రాంచందర్ రావుకు అస్వస్థత
నాంపల్లిలో టెన్షన్ టెన్షన్: బీజేపీ చీఫ్ రాంచందర్ రావుకు అస్వస్థత
BJP


హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఫీజు ఫీజురీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో బీజేపీ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 'ఫీజు బకాయి - బీజేపీ లడాయి' పేరుతో నిరాహార దీక్ష చేపట్టింది. ఈ పోరాటంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి రాంచందర్ రావు దీక్షలో కూర్చున్నారు.

దీక్షా శిబిరంలో సుదీర్ఘ గంటల పాటు ఆహారం, నీళ్లు లేకుండా కూర్చోవడంతో మధ్యాహ్న సమయానికి రాంచందర్ రావు ఆరోగ్యం మందగించింది. ఆయన నిరసించిపోవడంతో వెంటనే వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయన రక్తపోటు (BP) 90/60కి పడిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నందున విశ్రాంతి తీసుకోవాలని, దీక్షను విరమించాలని వైద్య బృందం ఆయనకు సూచించింది. పార్టీ ముఖ్య నేతల విజ్ఞప్తి మేరకు రాంచందర్ రావు మధ్యాహ్నం 3 గంటలకు తన నిరాహార దీక్షను విరమించనున్నారు. అయితే, ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లించే వరకు విద్యార్థుల తరఫున బీజేపీ పోరాటం ఆగదని, భవిష్యత్తులో ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande