
హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.) మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ ముత్తు యాదవ్పై సస్పెన్షన్ వేటు పడింది. సుమంత్కు సంబంధించిన వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. సుమంత్పై ఎఫ్ఎఆర్ (FIR) నమోదు చేయడంలో, అలాగే కేసు నమోదైన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకోవడంలో సీఐ ముత్తు యాదవ్ తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు అధికారులు గురించారు. కాగా స్థిరాస్తి వ్యాపారిపై దాడి, హత్యాయత్నం కేసులో సుమంత్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ ఓఎస్డి సుమంత్ కోసం నగర పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు