విద్యార్థుల భవిష్యత్తు, పేద ప్రజల విద్యాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. మంత్రి పొన్నం
విద్యార్థుల భవిష్యత్తు, పేద ప్రజల విద్యాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. మంత్రి పొన్నం
Ponnam


హుస్నాబాద్, 25 ఆగస్టు (హి.స.)

విద్యార్థుల భవిష్యత్తు, పేద ప్రజల విద్యాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి ఒక్కరోజు కూడా విద్యార్థుల సమస్యలపై పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంతో పాటు, భవిష్యత్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చెల్లింపులు చేసే విధానాన్ని తీసుకొచ్చాం.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజు రీయింబర్స్మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, విద్యా మౌలిక వసతులు, డైనింగ్ చార్జీలు, ఉపాధ్యాయుల నియామకాలు తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది.

పేద పిల్లల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఫీజు రీయింబర్స్మెంట్స్ను కొనసాగిస్తున్నాం.. పాత బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తూ, యాజమాన్యాలు విద్యార్థుల విద్యకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. రాజకీయంగా ఉనికిని చాటుకోవడం కోసమే కొందరు నేతలు ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగిస్తున్నారు.” రాహుల్ గాంధీ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేసే ముందు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదే విధంగా ఉచిత విద్య లేదా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు, హక్కుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యతను విస్మరించి, అంతర్గత రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు.. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా, విద్యా రంగ అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి పని చేయాలి.

దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యార్థి యువతకి వ్యతిరేకంగా పని చేయడం వల్లే జెన్ జీ లాంటి ఉద్యమాలు వస్తున్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande