
ములుగు, 25 ఆగస్టు (హి.స.) జిల్లాలోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని ములుగు జిల్లా కలెక్టర్, జిల్లా చిత్తడి నేలల కమిటీ చైర్మన్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్ లో డి ఎఫ్ వో వికాస్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్ జి లతో కలసి కలెక్టర్ జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తడి నేలలు, జలవనరుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటి విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సూచించారు. జలవనరుల పరిశీలనలో నీటిపారుదల, అటవీ, రెవెన్యూ శాఖలు ప్రధాన బాధ్యత వహించాలని, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక, కాలుష్య నియంత్రణ మండలి, మత్స్య, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..