
విజయవాడ, 25 ఆగస్టు (హి.స.)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు రక్షణ గోడల నిర్మాణ పనులు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, అత్యాధునిక టెక్నాలజీతో స్టీల్ నెట్టింగ్ మరియు బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పనుల దృష్ట్యా ఘాట్ రోడ్డు గుండా వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi