
రేణిగుంట, 25 ఆగస్టు (హి.స.)రేణిగుంట పట్టణ పరిధిలోని టపాసుల గోదాం ప్రక్కన ఉన్న వైన్స్ షాపు,ఆంధ్రజ్యోతి పెట్రోల్ బంక్ ప్రక్కన ఉన్న వైన్స్ షాపుల్లో ఉదయాన్నే మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.
సాధారణంగా నిర్ణీత సమయం తర్వాతే మద్యం విక్రయాలు ప్రారంభించాల్సి ఉండగా,అందుకు ముందే షాపులు తెరిచి విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉదయాన్నే మద్యం విక్రయాలు జరగడంతో ఆయా ప్రాంతాల్లో మద్యం ప్రియుల సందడి కనబడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సంబంధిత ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.నిర్ణీత వేళలను పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత షాపులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV