
అంతర్వేది: , 26 ఆగస్టు (హి.స.)
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. అంతర్వేది సాగర సంగమం వద్ద ఇసుక దిబ్బలను వేగంగా ఢీకొట్టడంతో సోనా బోటుకు రంధ్రం పడింది. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులను తీసుకొచ్చేందుకు హార్బర్ నుంచి మరో బోటు వెళ్లగా.. కెరటాల ధాటికి దానికీ రంధ్రం పడింది. దీంతో ఆ బోటు వెనక్కి వచ్చేసింది. స్థానిక మత్స్యకారులు, సివిల్ మెరైన్ పోలీసులు అతి కష్టం మీద సాగరసంగమం వద్ద చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ