
అన్నమయ్య జిల్లా, 26 ఆగస్టు (హి.స.)అన్నమయ్య జిల్లా లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పల్లెల్లో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాలలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు.
రాత్రి వేళల్లో గ్రామాల్లోనే బస చేసిన పోలీసు బృందాలు స్థానిక ప్రజలతో మమేకమై శాంతిభద్రతలను సమీక్షిస్తూ, మహిళలు, చిన్నారుల రక్షణకు భరోసా కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల వేళ గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కొత్తవారి కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV