రాయదుర్గం అనంతపూర్ హైవే పై బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
రాయదుర్గం అనంతపూర్ హైవే పై బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
accident


అనంతపురం, , 27 ఆగస్టు (హి.స.)

రాయదుర్గం-అనంతపురం హైవేపై బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(గురువారం) తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రాఘవేంద్ర, నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande