
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతీరోజు బయల్దేరే కాచిగూడ-అశోకాపురం ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణ సమయంలో ఎలాంటి మార్పులేదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె. శ్రీధర్ తెలిపారు. ప్రతీరోజు రాత్రి 7.5 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.55 గంటలకు మైసూరులోని అశోకాపురం చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణం లో మధ్యాహ్నం 2.55 గంటలకు అశోకాపురం రైల్వే స్టేషన్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్