ప్రముఖ నటుడు.జీ వీ.నారాయణ రావు కన్నుమూత
ప్రముఖ నటుడు.జీ వీ.నారాయణ రావు కన్నుమూత
ప్రముఖ నటుడు.జీ వీ.నారాయణ రావు కన్నుమూత


అమరావతి, 27 ఆగస్టు (హి.స.)

: ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. ఆయన ఇకలేరనే విషాదకర వార్తను నటి కరాటే కల్యాణి సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. నారాయణ రావు (G.V. Narayana Rao Passes Away) 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1976లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’ చిత్రంతో నటుడిగా పరిచయమైన ఆయన.. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న నారాయణరావు.. రజనీకాంత్, చిరంజీవిలకు మంచి మిత్రుడే. ‘అంతులేని కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, హిట్లర్ వంటి సినిమాల్లో నటించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్ళి నీకు శుభం నాకు సినిమాలను నిర్మించారు. నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం తెలిపింది.

కృష్టజిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణ రావు బాల్యం, విద్యాబ్యాసం గుంతకల్లులో సాగింది. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఎ.ఆర్.కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. చదువుకునే రోజులలో మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర తదితర నాటకాలలో నటించారు. దివంగత సినిమా నటులు కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులు నారాయణరావుకు రంగస్థల మిత్రులు. సినిమాలతో పాటు పలు టి.వి.సీరియళ్లలోనూ నారాయణ రావు నటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande