మద్దూరు మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మద్దూరు మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Collector


నారాయణపేట, 27 ఆగస్టు (హి.స.) నారాయణపేట జిల్లాలోని మద్దూరు మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను గురువారం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తీరును ఆమె పరిశీలించారు.

ముందుగా మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది క్యాడర్ స్ట్రెంగ్త్, ఖాళీలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల వారీగా ఇప్పటివరకు వచ్చిన ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు దరఖాస్తుల వివరాలను పరిశీలించారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా లేదా అని ఆపరేటర్ను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, ఇతర ఆదాయ వనరులపై కమిషనర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. రోజువారీగా ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఏ రోజైనా రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయా అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande