నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల. క్షేమ సమాచారాల పై మంత్రి లోకేష్.సమీక్ష (update)
నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల. క్షేమ సమాచారాల పై మంత్రి లోకేష్.సమీక్ష
నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల. క్షేమ సమాచారాల పై మంత్రి లోకేష్.సమీక్ష (update)


అమరావతి, 27 ఆగస్టు (హి.స.)

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారాలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. నేపాల్ల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల గురించి అడిగి తెలుసుకున్నారు. నలుగురు సురక్షితంగా ఉన్నారని.. మరో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదని మంత్రికి ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు తెలియజేశారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మీల ఆచూకీ లభించలేదని వెల్లడించారు.

కనిపించకుండా పోయిన ముగ్గురి ఆచూకీని కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని లోకేశ్ సూచించారు. చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్ చివరిసారిగా కనిపించినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు.. కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్నా.. క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సురక్షితంగా ఉన్న వారిని వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేశ్ సూచనలు చేశారు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులు, మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు తెలుసుకుంటున్నారు. మంత్రి లోకేశ్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande