
ఆసిఫాబాద్, 27 ఆగస్టు (హి.స.)
జిల్లాకు కేటాయించిన వన మహోత్సవం లక్ష్యాన్ని అధికారులు పూర్తి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్. ఎం.డేవిడ్. జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు. జిల్లా ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. జిల్లాకు కేటాయించిన వన మహోత్సవం లక్ష్యాన్ని ఆయా శాఖలఅధికారులు సమన్వయంతో పనిచేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.ప్రభుత్వ భూములు. కార్యాలయాలు. విద్యాలయాలు. కాలువ చెరువు గట్లపై. రహదారికి ఇరువైపులా అవసరమైన మొక్కలను నాటి వాటి రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వన మహోత్సవంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..