రహదారి భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలి.. అడిషనల్ కలెక్టర్
రహదారి భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలి.. అడిషనల్ కలెక్టర్
Collector


కామారెడ్డి, 27 ఆగస్టు (హి.స.)

జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పటిష్టంగా చేపట్టాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి, అవసరమైన రహదారి భద్రతా చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అటవీ ప్రాంతాల గుండా వాహనాలు ప్రయాణించే సమయంలో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ సూచించారు. అటవీ ప్రాంతాల్లో వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని కోరారు.

జాతీయ రహదారుల వెంబడి అనధికారికంగా నిర్వహిస్తున్న అక్రమ ధాబాలు, రహదారి భద్రతకు అవరోధంగా ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు రహదారుల పరిస్థితి, ప్రమాదకర మలుపులు, అవసరమైన సూచిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande