
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)
అనారోగ్య కారణాలతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రి (Yashoda Hospital)లో చేరిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల (Shivpratap Shukla) చికిత్స అనంతరం ఈరోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి యశోద ఆస్పత్రి నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు గుండె సంబంధిత శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. కాగా, ఇవాళ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఆస్పత్రికి వెళ్లి గవర్నర్ను నేరుగా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా పూర్తి కోలుకోవాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..