కాకినాడ లో జిమ్.ట్రైనర్.సతీష్ రెడ్డి దారుణ హత్య
కాకినాడ లో జిమ్.ట్రైనర్.సతీష్ రెడ్డి దారుణ హత్య
murder


మసీదుసెంటర్(కాకినాడ),, 27 ఆగస్టు (హి.స.)

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని చెక్కముక్కతో మెడలో పొడిచి హత్య చేసిన సంఘటన కాకినాడలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కాకినాడ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ, రామకృష్ణారావుపేటకి చెందిన కొడమాటి సతీష్రెడ్డి(30) జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. తండ్రి చిన్నతనంలో చనిపోయారు. ఏడాది కిందట జయశ్రీతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. ఇటీవల సతీష్రెడ్డి అతని స్నేహితుడైన గొడారిగుంటకు చెందిన బొందల సాయికిరణ్ ప్రియురాలితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. యువతి విషయాన్ని సాయికిరణ్కు జయశ్రీ చెప్పడంతో స్నేహితుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భానుగుడి సమీపంలో సతీష్రెడ్డితో సాయికిరణ్, అతని స్నేహితులు ఘర్షణకు దిగారు. చెక్కముక్కతో సతీష్ తలపై బలంగా కొట్టారు. చెక్క ముక్క కొంత విరిగిపోవడంతో సూదిగా ఉన్న మొనతో సతీష్రెడ్డి మెడపై సాయికిరణ్ పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి స్నేహితుడు ఆల్తాఫ్ ఇచ్చిన సమాచారంతో సతీష్రెడ్డి సోదరుడు ఎర్రయ్యరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎం.అప్పలనాయుడు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande