అర్హులందరికీ రేషన్ కార్డులు.. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు.. ఖానాపూర్ ఎమ్మెల్యే
అర్హులందరికీ రేషన్ కార్డులు.. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు.. ఖానాపూర్ ఎమ్మెల్యే
Mla


నిర్మల్, 27 ఆగస్టు (హి.స.)

అర్హులందరికీ రేషన్ కార్డులు.. ఇల్లు

లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామంలో నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు.

అదే విధంగా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెలు లేని గ్రామాలను చూడాలనేది సీఎం లక్ష్యమని తెలిపారు. ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ప్రతి అర్హుడికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత నాదే అని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్పష్టం చేశారు. లక్కారం గ్రామంలో ఇప్పటికే చాలా వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని, గ్రామంలో ఉన్న చెరువును మినీ ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande