పల్నాడు జిల్లా.చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 7 గురి మృతి
పల్నాడు జిల్లా.చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 7 గురి మృతి
accident


పల్నాడు, 27 ఆగస్టు (హి.స.)

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, సత్య కుమార్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం, పలువురు గాయపడటంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆటోను ఢీకొని ఏడుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతి చెందిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామస్థులుగా అధికారులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంత్రి లోకేశ్ తీవ్ర విచారం..

‘పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకే ఊరికి చెందిన వారు పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తూ ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని లోకేశ్ పేర్కొన్నారు.

తక్షణ చర్యలకు హోంమంత్రి ఆదేశం..

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పల్నాడు జిల్లా అదనపు ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బస్సు వేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం సహా అన్ని కోణాల్లో విచారణ చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాల రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు హోంమంత్రి అనిత ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మెరుగైన వైద్య సేవలకు సత్యకుమార్ ఆదేశం..

ఈ ఘటనపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గుంటూరు జీజీ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande